04 June 2010

కొమ్మపైన కోకిలమ్మ కొత్త పాట పాడెనమ్మ

కొమ్మపైన కోకిలమ్మ కొత్త పాట పాడెనమ్మ
కలల కోట ఇలలో ఇల్లనీ..కనుల ముందు స్వర్గం ఇల్లనీ...
కొమ్మపైన కోకిలమ్మ కొత్త పాట పాడెనమ్మ
కలల కోట ఇలలో ఇల్లనీ..కనుల ముందు స్వర్గం ఇల్లనీ...
వసి వాడనీ సహవాసమె మసిబారని దరహాసమె..
చిందే వనం బృందావనం గృహసీమనీ..
కలల కోట ఇలలో ఇల్లనీ..కనుల ముందు స్వర్గం ఇల్లనీ...

||కొమ్మపైన||

మరపించు మురిపాలా చిగురించు సరసాలా..
రసరంగ వల్లే ఇల్లనీ.. ఆ ఆ ఆఆఆఅ
అనుభూతి పర్వాలా.. అభిమాన గర్వాలా..
భవ భారతం ఏ ఇల్లనీ...
తూనీగ లా తన వాకిటే ప్రతి బాల్యమూ తిరగదా... తీయంగా...
ఎండైన వానైనా నీడల్లె తోడుండీ కాపాడదా ఇల్లే..
చిన్ని చిన్ని నడకలు నేర్పే బ్రతుకు బడి గంటే ఇల్లనీ
ఇంటి సాటి ఏదీ లేదనీ.. ఇంటి సాటి ఏదీ లేనె లేదనీ..

||కొమ్మపైన||

వంటింటి ఘుమఘుమలా పెరటింటి గుసగుసలా
కలబోత తళుకే ఇల్లనీ..
వెల్లుల్లి తుళ్ళింతా నీరుల్లి గిలిగింతా
పులకింత వింతే ఇల్లనీ..
అనుబంధమే ఒక సంద్రమై సంగీతమే పాడదా..శ్రావ్యంగా
అమ్మైన నాన్నైనా కురిపించు నీపైనా వెలలేని వాత్సల్యమే..
చిట్టిచిట్టి మాటలు నేర్పే నీకు తొలిదైవం అమ్మనీ
దారి చూపు దీపం నాన్ననీ...దారి చూపు దీపం నాన్నేననీ...

||కొమ్మపైన||

No comments: