రామసక్కనోడమ్మ సందమావా
రాక రాక ఎందుకొచ్చే అయ్యోరామా
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవ
అత్త కొడకా అని నిన్ను అల్లుకోనా
అత్తిపత్తిలాగ నేను ముడుచుకోన
అత్తారు పన్నీరు అద్దుకోవె
ఆ మీద చిటెకెనేలు అందుకోవే
రామసక్కనోడమ్మ సందమావా
రాక రాక ఎందుకొచ్చే అయ్యోరామా
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవ
కొప్పులో పువ్వులా రేకురాలకుంటె
నీచెంపలో ముద్దులు నింపుతానులే
చేతుల గాజుల సద్దు చేయకుంటలే
ముద్దుకో కౌగిలి ముట్టచెప్పెలే
హే నిన్ను నన్ను చూస్తాఉంటే
నోరూరుతుందే ఊరోళ్ళకు
జడతోని మంచిగా దిష్టి తీసి
చుట్టుకుంట నీకు నేను పైట చాటు
యాదగిరి గుట్ట మీద ఒట్టు పెట్టు
రామసక్కనోడమ్మ సందమావా
రాక రాక ఎందుకొచ్చే అయ్యోరామా
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవ
మామిడిచెట్టులా ఉంటవమ్మ ఎప్పుడూ
అందనే అందవు పొందటానికీ
పక్కనే చక్కనీ నిచ్చెనుంది చూసుకో
పండినా కొమ్మను వంచటానికీ
సింగమోలే నేను వస్తే
సిగ్గు పల్లకీలో చోటిస్తవా
పట్టు తేనెలు ఇచ్చుకోనా
ఉట్టి మీద జున్నుపాలు దాయకుండా
చల్లకొచ్చి ముంత నువ్వు దాయకుండా
రామసక్కనోడమ్మ సందమావా
రాక రాక ఎందుకొచ్చే అయ్యోరామా
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవ
No comments:
Post a Comment