07 June 2010

అవుననా! కాదనా! నాదనా!

అవుననా! కాదనా! నాదనా!
లేదనా! రాదనా! వేదనా!

మూగమైనా రాగమేనా
నీటిపైనా రాతలేనా
||అవుననా||

తారకా రా దూరమైన చోటనే ఆకాశాలు
తను నేను వెల్లువైతే వెన్నెలే కాబోలు
నింగి నేల ఏకమైన పొద్దులో సింధూరాలు
నీకు నేను చేరువైనా ఎందుకో దూరాలు
దొరికింది దొరికింది తోడలే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
దొరికింది దొరికింది తొడలే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
ఇందుకేనా! ప్రియా ఇందుకేనా!
||అవుననా||

ఆశలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే
శ్వాసలేలే బాసలన్నీ బాధలై పోయేలా
పూలజడలో తోకచుక్క గుట్టుగా ఊయల ఊగీ
రాసలీల రక్తధార బాధలై పోయేలా
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది మెరిసింది మెరుపేదో మెరిసింది
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది మెరిసింది మెరుపేదో మెరిసింది
ఇందుకేనా ప్రియా! ఇందుకేనా!
||అవుననా||

No comments: