07 June 2010

ఏ శకునీ ఆడని జూదం

ఏ శకునీ ఆడని జూదం
బతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణ కాష్టం
చితిలోనే శీమంతం
ఇది మంచికి వంచన శిల్పం
ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మా 'తరం'!
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
||ఏ శకునీ||

మిగిలినా దిక్కుగా
నిలిచినా నాతల్లికై
పొగిలినా నింగిలో
నిలవనీ ధృవతారకై
రాజ్యాలేలే ఈ డబ్బు హోదా కాలే జ్వాలను నేనై
జీవన యజ్ఞం సాగించగా
వచ్చే ఆపద
విచ్చే పూపొర నడిపిస్తాం కదా!
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

No comments: