03 June 2010

అబ్బ ఏం ఏం...ఘాటుగుందో... అముద్దు అముద్దు ముద్దు ముద్దు

అబ్బ ఏం ఏం...ఘాటుగుందో... అముద్దు అముద్దు ముద్దు ముద్దు...
అబ్బ ఏం ఏం...స్వీటుగుందో... అముద్దు అముద్దు ముద్దు ముద్దు..
చలి పెరిగిన వేళ లవ్ మీ లవ్ మీ స్వరాన గిలి కలిగిన వేళ గివ్ మి గివ్ మి జ్వరాన
మళ్ళీ మళ్ళీ అదే ఇవ్వనా...

||అబ్బ ఏం ఘాటు||

ఓరి మన్మధుడో ఏవి చేస్తివి రో తెగ మెరిసిన సొగసును గని మనసుకు దారే తోచదే
ఓర చూపులతో దోర సోకులనే అతి చనువుగ తడిమిన మగ సెగలకు ఈడే కాగెనే.
అసలు ఇలాటి అవస్థ అనేది మనకు తెలీదు నిన్న...
సిసలు లవంటే ఇలాటిదనేది తెలిసి వచ్చిందీ వేళ...
ప్రేమ లో పడ్డానా మైకమే కమ్మేనా రోమియో అయ్యాన ఇంతలో అయ్యెనా
తొలికలయిక లోనే హలో హలో అనేనా
పులకింతలలోనే మది మతి చెడేనా
అల్లిబిల్లి ముళ్ళే అల్లే కధా లలన....

||అబ్బ ఏం ఘాటు||

ఆడ ఆశలతో జోడు చేరమని నర నరమున నస పెరిగెను వయసుకు నేడే ఎందుకో
కోడె ఊసులతో కౌగిలియ్యమని ఉసురుసురని ఉసిగొలిపిన సరసుని తోడే అందుకో
కలుసుకుందాము కౌగిట్ల సందిట్లొ తగిన లగ్గాలు చూసి
తెలుసుకుందాము ఏకాంత సీమల్లో చిలిపి అర్ధాలు తీసి
కిస్సిలో రుచేదో కాంక్షలో కసేదో
హాయిలో అదేదో రేయిలో తుదేదో
రుచి తెలిసిన తీపి ఇంకా ఇంకా అనేలా
చెమరింతలు రేపి సుఖం ఇదే అనేలా..
మళ్ళీ మళ్ళీ అదే పనిగా...

||అబ్బ ఏం ఘాటు||

No comments: