అలా మండి పడకే జాబిలీ..
చలీ ఎండ కాసే రాతిరీ..
దాహామైన వెన్నెల రేయీ
దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుసుకోనూ ప్రేమనీ
ఎలా పిలుచుకోను రమ్మనీ
నిన్ను చూడకున్నా నీవు చూడకున్నా
నిదురపోదు కన్ను నిశిరాతిరీ..
నీవు తోడు లేకా నిలువలేని నాకు
కొడి కట్టనేలా కొన ఊపిరీ
ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమా
ఎలా పాడుకోను నిట్టూర్పు జోలా
ఈ పూలబాణాలు ఈ గాలి గంధాలు
సోకేను నా గుండెలో తుది లేని సయ్యాటలో
పూటకొక్క తాపం పూల మీద కోపం
పులకరింతలాయె సందెగాలికీ
చేదు తీపి ప్రాణం చెలిమిలోని అందం
తెలుసుకుంది నేడే జన్మ జన్మకీ
సముఖాన ఉన్న రాయబారమాయే
చాటు మాటునేవొ రాసలీలలాయె
ఈ ప్రేమ గండాలు ఈ తేనె గుండాలు
గడిచేది ఎన్నాళ్ళకో కలిసేది ఏనాటికో
No comments:
Post a Comment