07 June 2010

తలంబ్రాలతో దోసిళ్ళూ.. తనువందాల దోపిళ్ళూ..

తలంబ్రాలతో దోసిళ్ళూ.. తనువందాల దోపిళ్ళూ..
కందిన అందపు కావిళ్ళూ.. కన్నె బుగ్గలో క్రావళ్ళూ..
దోసిళ్ళెత్తిన చేతుల చాటున.. దోచక తప్పని దోర సొగసులు..
దోపిడి చూపుల రాపిడి తగిలీ దోబూచాడిన లేత సిగ్గులు..

కలువ వచ్చే చేయి కలువపూ మొగ్గా..
కలుపుకున్న వేళ్ళు చంద్ర కిరణాలు..
కలవరించే కన్ను కమలపూరేకూ..
కన్ను కలిపే చూపు సూర్య కిరణాలూ..

పుట్టింటి పూబంతి పుణ్యాల రాశీ..
అత్తింటి కెళ్ళేటి ఆఘడియలోనా..
అప్పగింతల వేళ ఉప్పొంగి వచ్చే..
కన్నవారి ప్రేమ కన్నీటి గంగా..
కట్టుకున్న ప్రేమ కడలేని కడలీ..
ఆ కడలిలో గంగ కలిసేటి వేళా..
మమతలన్నీ కలిసి మౌనరాగాలూ..
శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలూ..

సిరినీవే రావమ్మా.. చిగురాకు రెమ్మా..
హరిలాంటి అబ్బాయీ దొరికాడు లేమ్మా..
పుట్టింటి వారింటీ పుణ్యాల కొమ్మా..
అత్తింట కుడికాలూ పెట్టి రావమ్మా..

No comments: