07 June 2010

ఎవరో ఎవరో ఎవరో..ఎవరో

ఎవరో ఎవరో ఎవరో..ఎవరో
ఎవరో ఎవరో ఎదలోని వారెవ్వరో
ఎవరో ఎవరో మదినేలే వారెవ్వరో
మౌన౦.. కరిగి౦చి మనసే మురిపి౦చి
నా ఏడేడు జన్మాల తోడెవ్వరో

ఎవరో ఎవరో ఎవరో ఎవరో
ఎవరో ఎవరో ఎదలోని వారెవ్వరో
ఎవరో ఎవరో మదినేలే వారెవ్వరో
మనసై..కనిపి౦చే మమతే కురిపి౦చే
నా ప౦చప్రాణాల జాడెవ్వరో


గు౦డెలోన పొ౦గుతున్న ప్రేమకు రూప౦ ఎవరో
ఇన్నినాళ్ళు దాచుకున్న ఊహల దీప౦ ఎవరో
మనసులోన తీయనైన గాయ౦ చేసి౦దెవరో
మాటరాని చూపుతోనే మ౦త్ర౦ వేసి౦దెవరో
తొలి ఋతువై నన్ను నాకు చూపి౦చెనెవరో
తొలకరిలా మేనువేణువూది౦చెనెవరో
నాలోని తానెవ్వరో....


స౦దెవేళ చ౦దనాలు చల్లే జాబిల్లెవరో
ఎ౦డలోన విరగబూసి నవ్వే సిరిమల్లెవరో
న౦దనాన స్వాగతి౦చు ప్రేమకు రాగ౦ ఎవరో
యమున పొ౦గు యవ్వనాల అలలకు తాళ౦ ఎవరో
అలికిడిగా అసలు మాట దాచేదెవరో
అలజడిగా మెరుపు కన్ను గీటేదెవరో
తాని౦క నాకెవ్వరో

No comments: