07 June 2010

మల్లికా నవ మల్లికా

మల్లికా ఆ....
మల్లికా నవ మల్లికా
మదనోత్సవ సంగీత సంచిక
రగిలే వేసవి రాగమాలికా
మధుర శరదృతు మౌనగీతికా
ప్రేమిక మానస లగ్నపత్రిక
పులకింతల తొలి చూలు పుత్రికా
మల్లికా ఆ....

యలమావులలో విరితావులలో
మనసుల కోయిలలెగసే వేళ
వయసంతా వసంత గానమై
జనియించిన యువ కావ్య కన్యక
మరులు గొలుపు మరుని బాణ దీపిక
మల్లికా...

తొలి కోరికలే అభిసారికలై
వలపుల కౌగిట బిగిసేవేళా
ఆ సొగసే అమృతాభిషేకమై
తనియించిన భువిలోన తారకా
మనసు తెలుపు తెలుపు నీదే మల్లిక
నా చంద్ర కైశిక
మల్లికా.. నవమల్లికా
మదనోత్సవ సంగీత సంచిక
మల్లికా.. ఆ..

No comments: