03 June 2010

అప్పారావు సుబ్బారావు సత్యారావు చిన్నారావు

అప్పారావు సుబ్బారావు సత్యారావు చిన్నారావు
వెంకట్రావు వెంగళ్రావు కొండల్రావు చందర్రావ్
మండల ప్రెసిడెంట్ మంగారావు జడ్పీటీసి రంగారావు
వియ్యేవో పుల్లారావు వీడీవో యెల్లారావు
వైసు ప్రెసిడెంట్ జయలక్ష్మి వార్డుమెంబరు వరలక్ష్మి...
వరలక్ష్మెవర్రా ? కత్తరెల్లి కట్టలు తీసుకొచ్చిందే అదే రా ఆ దుబయ్ సేట్ సెటప్పు ఓ అదా
లెక్కల మాస్టరు గోవిందం పక్కనె కద బెమ్మానందం
ఎత్తరుగుల ఎంకప్పా కిరాణకొట్టు కిట్టప్పా...
బెల్లందిమ్మల బంగారి శివాలయంలో పూజారి
మందుల షాపు ఆచారి... అక్కడాపోసారి
ఆ ఆచారు గాడు మొన్న దగ్గుబిళ్ళ అరువియ్యమంటె ఇయలేదు గదా
ఒరేయ్ ఆడికి మాత్రం కార్డియకండ్రా .. అలాగలాగే....
టూ టౌన్ యస్సయ్ బ్రమ్హాజీ పశువుల డాక్టరు తాతాజి
పోష్టు మాష్టరు సిమ్హాలు చర్చి ఫాదరు శామ్యూలు
మసీదు పక్కన మస్తాను నేనే నేరుగ ఇస్తాను
టూరింగ్ టాకీస్ పైడ్రాజు లేడీస్ టైలరు సూరిబాబు
ఆ సూరిబాబు గాడు మా ఆవిడ జాకెట్లు కుడతానని గుడ్డదీస్కెళ్ళి ఆర్నెల్లైంది
ఇంకా ఇయలేదు ఓ మరక్కడ గుర్తు చెయ్ రా ఎదవని దులిపేత్తాను.
సోది చెప్పే సూరమ్మా సాని మేళం కమలమ్మా
మహిళామండలి మల్లమ్మా డ్వాక్రా గ్రూపుల యల్లమ్మ
మధ్య నిషేదం మరియమ్మా కారా కిళ్ళీ కనకమ్మా
జీవిత భీమా సిమ్హాద్రి జనాభ లెక్కల శేషాద్రి
ఉరేయ్ శేషాద్రి నీ ఇంట్లో చైనా జనాభా అంత మందుంటారు ఆళ్ళంతా వస్తే పెల్లోళ్ళకి భోజనాలెక్కడుంటాయ్ ఇంట్లో ఎవల్లో ఒకల్లనే తీసుకురారోయ్...అర్ధమయిందర్ధమయిందొరేయ్ యదవాకాన.. ఆ కరెష్టు కరెష్టు
అమ్మల్లారా అక్కల్లారా ఇదిగోండమ్మా ఆహ్వానం...
ఏమో నమ్మా ఈ సారైనా అవుతుందా మరి కళ్యాణం..
అమ్మల్లారా అక్కల్లారా ఇదిగోండమ్మా ఆహ్వానం...
ఏమో నమ్మా ఈ సారైనా అవుతుందా మరి కళ్యాణం..
ఓరి మల్లి గా అక్కడేం చేస్తున్నార్ రా...
టెంటూ గింటూ వేసేసాం వేరే పనులు చెప్తారా వేసిన టెంటూ పీకేసి మళ్ళీ బాగా వేస్తారా
ఏండోయ్...అయ్‌గారయ్‌గారయ్‌గారు...అయ్‌గారయ్‌గారయ్‌గారు...అయ్‌గారయ్‌గారయ్‌గారు...అయ్‌గారయ్‌గారయ్‌గారు... ఏంటహే నీ నస....
పాలూ పళ్ళూ తెచ్చేసాం ఎక్కడ పెట్టాలండయ్యో...పెళ్ళే ఇంకా కాలేదు ఆటికి తొందర ఏంటయ్యో
పంతులు గారు వచ్చేసారా ఇదిగో ఈటు దయచేయండి...
మంగళ స్నానం చేయించారా పిల్లని తీసుకు రారండి...
ఏంట్రా అమ్మాయ్ గోరు ఇన్నాళ్ళు తానం జెయ్లేదా పొంతులు గారిప్పుడు తానం చేయించమంటున్నారు...
ఊరికి కొత్తగ వచ్చానండీ అడ్రస్ మీరే చెప్పాలి...ఏర్పాట్లన్నీ బావున్నాయి ఎవరిది చెప్మా ఈ పెళ్ళి....
మల్లింటి రామరాజు గారు లేరండి ఆళ్ళమ్మాయి సత్యభామ లేరండి ఆ అమ్మాయిని బెజవాడ పూసపాటి రంగరాజు గారి అబ్బయి సూరి రాజు కిచ్చి పెళ్ళి జేస్తున్నారండి ఆయ్...
పూసపాటి రంగరాజు అంతే నేనే కదా అంటే నాకు తెలీకుండా నాకొడుక్కి పెళ్ళా ఆ!!

No comments: