03 June 2010

ఇశాఖపట్నం సుందరి రో సిన్నోడో సిన్నోడా

ఇశాఖపట్నం సుందరి రో సిన్నోడో సిన్నోడా
పదారణాల పడుచుది రో సిన్నోడో సిన్నోడా..
పెళ్ళికి సిగ్నల్ ఇచ్చేయ్ రో సిన్నోడో సిన్నోడా...
పైసలు బాగా వస్తయి రో సిన్నోడో సిన్నోడా..
రేయ్ ఇన్రరేయ్ ఎర్రి సన్నాసి....

పైసల ఊసే గానీ నాన్న అందం చూడద్దా అమ్మయ్ చందం నచ్చద్దా
వంకలు పెట్టద్దబ్బీ నువ్వు అందందేవుంది మేకప్ వేస్తే వస్తుంది సింపుల్ రా...
వరెవ్వా ఐశ్వర్యారాయ్ అందం అందరికెట్టాగో రాదు
తనేమో రీమా సేన్ లాగా అయినా లేదే ఎట్టా సరి జోడు....
చక్కని చుక్కకు వంకలు ఎందుకు పెడతావబ్బాయి
సావిత్రల్లే గుండ్రంగానే ఉందిగ అమ్మాయి...
కురస గౌను లో పరసనాలిటీ అంత గ నచ్చిందా
కత్తిరించితే లంగా కాస్తా స్కర్టైపోనందా...
అదీ మంచేతిలో పని రా ఈ మాత్రం గూడా తెల్దు ఎట్టాబతుకుతావొ ఎర్రి నాగన్న

||ఇశాఖపట్నం ||
రేయ్ అమ్మ తర్వాత అమ్మ రా అత్తమ్మ పాపం బతిమిలాడుతుంది కదా ఒప్పీస్కో

కట్నం గట్రా అడిగానంటే లోకువ అయిపోనా భార్యకి బానిస అయిపోనా...
అట్టా అనుకుని ఉంటే మరి నాకీ పెళ్ళే అయ్యేదా నీకీ పుట్టుక ఉండేదా..నో బర్త్ రా
నిజం గా చెపుతున్నా ఇక వినను అంటే నా గతి ఏం గాను
సరింగా సెటిల్ అవకుండా మ్యారేజంటే ఓకే అనలేను
అందుకనే గద నెత్తీ నోరు బాదుకు జెప్తున్నా
మ్యారేజైతే సెటిల్ అవుతావని హామీ ఇస్తున్నా... ఒట్టు
పెళ్ళామనుకుని నోట్ల కట్టకే తాళిని కట్టాలా
కళ్ళు మూసుకుని ఇనప్పెట్టెతో కాపురముండాలా
రేయ్ నోట్ల కట్టలుంటేనే రా తాళికి ఆలికీ మనకీ యాల్యూ...

||ఇశాఖపట్నం||
రేయ్ ఏదో ఒకటి చెప్పు నువ్వు పెళ్ళి చేసుకుంటవా లేక నన్ను సన్యాసం తీసుకొమ్మంటవా
ఆ పంచేయ్ అదే బెస్ట్

No comments: