శ్రీ రామ నవమి తిరునాళ్ళు నాకప్పుడేమో ఆరేళ్ళు
నేనడగగానె ఈ బొమ్మ ముచ్చటగ కొంది మా బామ్మ
అప్పుడు దీని ఖరీదెంతో తెలుసా పది రూపాయలు
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం ||2||
నా వయసు అపుడు పది కామోసు మేమంతా వెళ్ళాం మదరాసు
పాండీ బజారను మాయా బజారు లొ ఈ జడకుచ్చులు పాపిట బిళ్ళలు
చెవి జూకాలు రవ్వల గాజులు ఎన్నో కొన్నది వెన్నంటి అమ్మదీ
అపుడు వీటి ఖరీదెంతో తెలుసా మరో రెండు సున్నాలు..
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
నాకప్పుడేమో టీనేజి పక్కూరిలోనే కాలేజీ ||2||
వెళ్ళి రావడానికి ర్యాలి సైకిలు వేసుకోవడానికి కొత్త చెప్పులు
పట్టు పావడాలు చోళి ఘాగ్రాలు ఎన్నో కొన్నారు మా మంచి నాన్నారు
అప్పుడు వీటి ఖరీదెంతో తెలుసా మరో సున్నా
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
పెళ్ళీడుకొచ్చావన్నారు పిల్లడ్ని తీసుకు వచ్చారు నచ్చడ అని అడిగారు
కాబోయే మొగుడన్నారు కట్నం గా పది లక్షలంటా నగ నట్ర పొలం గట్ర ఇవ్వాలంటా
తీరా అన్ని ఇచ్చాక నేను కూడ వారి వెంట పుట్టిల్లు వదిలిపెట్టి వెళ్ళాలంటా...
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
మొగుడి కోసం బోల్డు డబ్బు పోసాం రాను అంటే ఎందుకూరుకుంటాం...
ఇదేమి రూలు ఇదేమి న్యాయం చూసారా ఈ విడ్డూరం...
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
ఎన్ని చెప్పిన మేం తాళి కట్టాం అత్తరింటికే నిన్ను తీసుకెళ్తాం...
No comments:
Post a Comment