03 June 2010

చిలక లాగ చినుకు లాగ తెలుగు వారి పల్లెటూరి ఎంకిలా

చిలక లాగ చినుకు లాగ తెలుగు వారి పల్లెటూరి ఎంకిలా...
కొలనులోని కలువ లాగ వాలిపోయి మొక్క జొన్న కంకి లా...
తామరాకు మీద నీటి బొట్టులా వరిగింజ దొంగిలించు పాలపిట్టలా
కొప్పులోన ముడుచుకున్న పువ్వులా... ఉయ్యాలలోన చంటి పాప నవ్వులా
సాగిపోనీ హాయి రాగం వయసు హోరు మంచి జోరు మీద ఉన్న వేళలోన....

||చిలక లాగ||

కూసే కోయిల లా తొలిఝాము కోడి పుంజు లాగ చెంగున పరిగెత్తే తువ్వాయ్ లా
పారే నది లాగా నదిలోన చేప పిల్ల లాగ చల్లని వెన్నెల లా వేకువలా
చెరుకు కర్ర లా గరిక పువ్వు లా తేనె జల్లు లా వాన విల్లు లా...
వయసు హోరు మంచి జోరు మీద ఉన్న వేళలోన....

||చిలక లాగ||

గుళ్ళో మంత్రం లా గుడి మీద పావురాయి లాగ తూలే పరువం లా తుంటరి లా...
డూడూ బసవన్న తల ఊపుతుంటె గంగ డోలు ఊగి తెగ మోగే గంటల్లా....
నల్ల మబ్బు లా తెల్ల కొంగ లా... నీళ్ళ బిందె లా కాలి అందెలా...
వయసు హోరు మంచి జోరు మీద ఉన్న వేళలోన....

||చిలక లాగ||

No comments: