ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ
విశ్రమించ వద్దు ఏ క్షణం - విస్మరించ వద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా... ||ఎప్పుడూ||
నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేను రా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేను రా
పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గ లేదు రా
గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుంది రా
నిశా విలాసమెంత సేపు రా ఉషొదయాన్ని ఎవ్వడాపు రా
రగులుతున్న గుండె కూడ సూర్య గోళమంటిదేను రా ||ఎప్పుడూ||
నొప్పి లేని నిముషమేది జనమైన మరణమైన జీవితాన అడుగు ఆడుగునా
నీరసించి నిలిచిపోతె నిముషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణా
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది అంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌను రా
నిరంతర ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటు వున్నవరకు చావుకూడ
నెగ్గలేక శవము పైనె గెలుపు చాటు రా ||ఎప్పుడూ||
No comments:
Post a Comment