చందమామా చందమామా అంతదూరం ఎందుకమ్మా
కన్నెభామా కన్నెభామా ఆపవే హంగామా
చందమామా చందమామా అంతదూరం ఎందుకమ్మా
కన్నెభామా కన్నెభామా ఆపవే హంగామా
హాయ్‌రామా అందుకోమ్మా అలుసా చెలిప్రేమా
అయ్యొరామా కుట్టకమ్మా కులుకుల చలిచీమా
తగదమ్మా మగజన్మా మొగమాటమా ||చందమామా||
అన్నీ ఇస్తా అన్నాక ఆత్రంగా ఔననక ఆలోచిస్తానంటావా అంతుచూడకా
అంతోఇంతో బిడియంగా తలవంచుకు నిలబడక కంచేతెంచుకు వస్తావా ముందు వెనుక చూడక
సిగ్గే సిగ్గుపడి తప్పుకుంది చాటుగా
అగ్గై వెంటపడి అంటుకోకె అన్యాయంగా ||చందమామా||
కొంచెం అలవాటయ్యాక రెచ్చిపోతే పద్ధతిగా అంతేగాని ఇంతిదిగా ఇదేం వేడుకా
మీసం రోషం నచ్చాకే మనసిచ్చా ముచ్చటగా మీనం మేషం లెక్కెడుతూ జారిపోకు చల్లగా
సరదా తీరుస్తా సత్తువెంతొ చూపవే
పెదవే అందిస్తా మాటలాపి ముందుకురావే ||చందమామా||
No comments:
Post a Comment