చిలకమ్మా ప్రతి రేపవలు వెంటాడినదే నీ జ్ఞాపకం
అమ్మమ్మా తొలిచూపులొనే కనుపాపలలో నా కాపురం
చిన్న చిన్న కలతలు చిన్న చిన్న అలకలు వచ్చి పోయే అతిధులు మనకే
నూరు ఏళ్ళ బంధనాల తీపి ఏమి మారిపోదు రోజువారి ఇంటి గొడవలకే
ప్రేమన్నది ఉన్న చోటా...ఆ ఆ...ఆ.
కలహం ఒక చిన్న ఆటా...ఆ ఆ...ఆ.
చిలకమ్మా ప్రతి రేపవలు వెంటాడినదే నీ జ్ఞాపకం
మరుమల్లెల మంచం లో చిరు చీకతి దుప్పటిలో...
సరికొత్త రకం సరసాల సుఖం సరసం గా నేర్పేదా..
అటు జాబిలి చూస్తుంది కిటికీ తెరిచే ఉంది
తలుపెయ్యకనే తంటాలు పడే ఈ తొందర తప్పు కదా...
ఆలుమగలమేగా అంత దూరమేలా మోజు తీర్చగా మెల్లగా చల్లగా చేరవా..
చిలకమ్మా మొహమాట పడి మోహాన్ని మరీ పెంచావే...
అమ్మమ్మా మాటేవినని మహ మొరటు తనం నేర్చావే...
ఆ తొలిరోజుల తమకం నీ పెదవుల చలి గమకం
అది ఇప్పటికీ నా ప్రతి అణువూ దాచిందే పదిలంగా..
ప్రతి పూటా చీరలనీ నగలే పెట్టమనీ
వేధించాగా సాధించాగా గురుతుందీ నా కింకా...
తగవు మరచి పోవే తనువు మరచి రావే
ఆశ తీరగా వడిగా ఒడిలో పడవే...
చిలకమ్మా నా చేతులకే పని చెప్పు మరీ
అమ్మమ్మా ఊరించకనే ఒడి చేర్చుకుని ఓదార్చు మరీ
నిన్ను తాకి వెచ్చబడి నన్ను చేరుకున్న గాలి సంగతేదొ చెబుతుంది పాపం
చెప్పకుండ జంట మధ్య చేరుకుంటె తప్పదయ్య మంచుకైన మాయదారి తాపం
బిగి కౌగిలి పల్లవిగా ఆ..ఆ..ఆ.
ముద్దు ముచ్చట సాగునుగా ఆ..ఆ..ఆ..
||చిలకమ్మా||
No comments:
Post a Comment