22 June 2010

మావారు శ్రీవారు మామంచివారు

మావారు శ్రీవారు మామంచివారు కలనైన క్షణమైన నను వీడ లేరు
నను వీడ లేరు
మావారు శ్రీవారు మామంచివారు కలనైన క్షణమైన నను వీడ లేరు
నను వీడ లేరు
మావారు శ్రీవారు మామంచివారు

ఊహాతరంగాల ఉయ్యాల ఊగే
ఊహాతరంగాల ఉయ్యాల ఊగే ఊర్వశిని నేనే మేనకను నేనే
స్నేహానురాగాల సెలయేట తేలి
స్నేహానురాగాల సెలయేట తేలి శ్రీవారినలరించు దేవేరి నేనే
మావారు శ్రీవారు మామంచివారు

ఆనంద లోకాల సయ్యాటలాడే
ఆనంద లోకాల సయ్యాటలాడే ప్రేయసిని నేనే శ్రీమతిని నేనే
మందార మకరంద మాధురుల కోరి
మందార మకరంద మాధురుల కోరి మన్సార దరిచేరు దొరగారు మీరే

మావారు శ్రీవారు మామంచివారు కలనైన క్షణమైన నను వీడ లేరు
నను వీడ లేరు
నను వీడ లేరు
మావారు శ్రీవారు మామంచివారు

No comments: