22 June 2010

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో
రాముని అవతారం రవికులసోముని అవతారం....

రాముని అవతారం రవికులసోమునీవతారం
సుజనజనావన ధర్మాగారం దుర్జనహృదయవిదారం "రాముని"

దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ
కౌసల్యాపతి తపము ఫలించూ
జన్మింతురు సహజాతులు మువ్వురు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ శత్రుఘ్న భరతా "రాముని"


చదువులునేరుచు మిషచేత చాపముదాలిచిచేతా
విశ్వామిత్రుని వెనువెంట యాగముకావగ చనునంట
అంతముచేయునహల్యకు శాపము వొసగును సుందర రూపం "రాముని"

ధనువో జనకుని మనమున భయమో
ధారుణి కన్యాసంశయమో
దనుజులుకలగను సుఖగోపురమో
దనుజులుకలగను సుఖగోపురమో
విరిగెను మిథిలానగరమునా "రాముని"

కపట నాటకుని పట్టాభిషేకం
కలుగు తాత్కాలికా శోకం
భీకర కానన వాశారంభం
లోకోద్ధరణకు ప్రారంభం

భరతుని కోరికతీరుచుకోసం
పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికినవ నవసంతోషం
గురుజనసేవకు ఆదేశం "రాముని"

అదిగో చూడుము బంగరు జింకా (X2)
మన్నై చనునయ్యోలంకా
హరనయనాగ్ని పరాంగన వంకా
అరిగిన మరణమె నీకింకా

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానరకుల పుంగవ హనుమ (X2)
ముద్రిక కాదిది భువన నిదానం(X2)
జివన్ముక్తికి సోపానం (X2)
రామ రామ జయ రామ రామ
జయ రామ రామ రఘుకులశోమా
సీతాశోక వినాశనకారి
లంకావైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరంబౌనిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం
వెలయును ధర్మ విచారం "రాముని"

No comments: