07 June 2010

మనసే హే హే .. నిదురలేచే

మనసే హే హే .. నిదురలేచే
వయసే హే హే .. పరుగు తీసే

కళ్ళల్లో రోజూ కలలు కదలనీ .. నిన్నే నాలో కలపనీ
గుండెల్లో చెరగని గురుతవ్వాలనీ .. గువ్వై నీలో వాలనీ
అడగనా ఈ మనసు మలుపులో .. కొలువు తీరమనీ

ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ
ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ


చినుకులా జారి నీలో .. కడలిగా మారిపోనా
చూపునై వాలి నీలో .. కలలుగా మేలుకోనా
నమ్మలేని ఈ వింత అలజడీ .. నాకు మాత్రమే కలిగెనా
చిన్నమాటకీ మనసు తడబడీ .. చిటికె వేసి నిను పిలిచెనా


మౌనాన్ని దాటి నిను చేరి జంటగా గొంతు కలపమన్నా !

ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ
ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ


ఎదను మాని ఏ పిలుపూ .. పెదవి అంచుకే రాదే
నీవు లేని ఏ వైపూ .. అడుగు ముందుకే పోదే
కంటి రెప్పకీ విసుగు పుట్టదా నిన్ను దాచగా ప్రతి క్షణం
గుండె సైతమూ చోటు చాలక అలక పూనదా అనుదినం

తన నీడలాగ నే సాగి పోవు ఓ వరము కోరుకోనా !

ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ
ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ
ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ !

No comments: