07 June 2010

లేలేత పువ్వులే .. ఈ లేడి కూనలు

లేలేత పువ్వులే .. ఈ లేడి కూనలు
మా కంటి పాపలే .. ఈ చంటి పాపలు
ట్వింకిల్ ట్వింకిల్ తారలే .. కన్నుల్లో కాంతులూ
ఈ బోసి నవ్వుల్లోనా .. వేవేల వర్ణాలు
నా గుండె లోతుల్లోనా .. ఎగిసే పాటలూ !


ఆకాశం హరివిల్లేదో వేస్తున్నా
చిందే ఈ నవ్వులకూ చిన్నబోయెనా
ఆ కోయిల రాగాలే తీస్తున్నా
పలికే పసి గొంతులకూ వెన్ను చూపెనా


రేపటీ .. స్వప్నమే .. చూసే కళ్ళలో
లోకమే తమదనే .. దృశ్యం చూపుదాం !
ఓ నమ్మకాన్నే రాద్దాం .. ఈ చిన్ని గుండెలో
ఆ ఆశే దూసుకుపోదా నింగే హద్దంటూ !


ఉరికే ఆ నదులన్నీ క్షణమైనా
తోడెవరూ లేరంటూ ఆగిపోవుగా
వెలిగే ఆ సూర్యుడే కలనైనా
చిదిమే ఈ చీకటిలో ఉండిపోడుగా

పాడుకో .. ప్రతిక్షణం .. బ్రతుకే పాటగా
ఉదింగా .. జీవితం .. నీతో పాటుగా

నీ తోడు నువ్వై సాగి చేరాలి గమ్యమే
ఆ గెలుపు నడిచొస్తుందిక నీతో నీడల్లే !

No comments: