20 July 2010

ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే ముంచొద్దే

పల్లవి

ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చొద్దే
అయ్యో వన్నెలతో ప్రాణం తియ్యొద్దే ||ప్రియా||

చరణం 1

చెలియా నీదు నడుమును చూసా అరెరె బ్రహ్మెంత పిసినారి
తలపై కెత్త కళ్లు తిరిగిపోయే అహ అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచెగ మలచి రవివర్మ గీసిన వదనమట
నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెప్పిన రూపమట
భువిలో పుట్టిన స్రీలందరిలో నీదెనీదె అందమంట
అంతటి అందం అంతా ఒకటై
నన్నే చంపుట ఘోరమట ||ప్రియా||

చరణం 2

అందమైన పువ్వా పువ్వా అందమై
చంద్రగోళంలో ఆక్సిజన్‌ నింపి అక్కడ
నీకొక ఇళ్లు కాడతా నీ ప్రాణాలను కాపాడేందుకు
నాప్రాణాలను బదులిస్తా మబ్బులు తెచ్చి పరుపుగ
పేర్చి కోమాలాంగి నిను జోకొడతా
నిద్దురలోన చెమటల పడితే నక్షత్రాలతో
తుడిచేస్తా పంచ వన్నె చిలక
జలకలాడగ మంచు బిందువులే సేకరిస్తా
గంగా జలముగా సేవిస్తా ||ప్రియా||

No comments: