17 July 2010

ఏ అమ్మలార అక్కలార అంజిగాడికి ఓటు వెయ్యండీ

(ఆర్య-2 రింగ రింగ ట్యూన్)
ఏ అమ్మలార అక్కలార అంజిగాడికి ఓటు వెయ్యండీ..
అందరికీ తెలిసినోడు ఈడు చాలా మంచి వాడండీ..
అమ్మలార అక్కలార అంజిగాడికి ఓటు వెయ్యండీ..
అందరికీ తెలిసినోడు ఈడు చాలా మంచి వాడండీ..
మంది సొమ్మే ఎనకేసుకోడు మేడ మిద్దే కట్టేస్కోడూ..
ఏ అమ్మలార అక్కలార అంజిగాడికి ఓటు వెయ్యండీ..
అందరికీ తెలిసినోడు ఈడు చాలా మంచి వాడండీ..
మాట మీదా నిలబడతాడీడు మాయచేసే టైపే కాదూ..
ఏ అమ్మలార అక్కలార అంజిగాడికి ఓటు వెయ్యండీ..
అందరికీ తెలిసినోడు ఈడు చాలా మంచి వాడండీ..

(రాను రానంటూనే from జయం)
మా ఓడికోటెయ్యి తమ్ముడూ.. తమ్ముడూ..
మీ కోసం ఏమైనా చేస్తడూ.. చేస్తడూ..
మా ఓడికోటెయ్యి తమ్ముడూ.. తమ్ముడూ..
మీ కోసం ఏమైనా చేస్తడూ.. చేస్తడూ..
మా ఓణ్ణి గెలిపించు అమ్మడూ.. అమ్మడూ..
మీ తోడు నీడల్లే ఎప్పుడూ ఉంటడూ..
ఏసి లో తొంగోడూ ఎప్పుడూ.. ఎప్పుడూ..
పేరెట్టి పిలిచారా ఎంటనే వస్తడూ..
మా ఓడికోటెయ్యి తమ్ముడూ.. తమ్ముడూ..
మీ కోసం ఏమైనా చేస్తడూ.. చేస్తడూ..

(ఏక్ నిరంజన్ టైటిల్ సాంగ్)
అమ్మా అయ్య అక్కా తంబీ..
ఓటే వేసి గెలిపించండీ అం..జి గాడ్ని..
ఎంతో సేవ చేస్తాడండీ..
అంతా కలిసి దీవించండీ అం..జి గాడ్ని..
MLA గా ఎపుడూ ఒకడేనేంటీ..
ఈ సారైనా ఈడిని గెలిపించండీ..
మనతోనే కలిసుంటాడు మన గోడే వింటాడూ..
మనుషుల్లో ఈళ్ళాంటోడూ ఎకడో ఒకడుంటాడూ..
బెంజి కారు లో ఈడు తిరగడే గంజి నీళ్ళు తాగుతాడే..
తెల్లారితే కళ్ళెదురుగా మనకెప్పుడూ ఎహె కనబడతాడే..

(ఆకలేస్తే from శంకర్ దాదా జిందాబాద్)
ఆకలేస్తే అన్నం పెడతడు మనకోసం కష్ట పడతడు
ప్రేమిస్తే ప్రాణం పెడతడు మా ఓడూ..
పెద్దోళ్ళకి దండం పెడతడు పేదోళ్ళకి గుడిసెలు కడతడు
అవినీతికి అడ్డం పడతడు మా ఓడూ..

(జింతాత జిత జిత from విక్రమార్కుడు)
వెయ్యండి బాబు ఓటూ రానివ్వడు ఏలోటూ..
వెయ్యండి బాబు ఓటూ రానివ్వడు ఏలోటూ..
ఆ కేటుగాడి సీటూ వీడి దెబ్బకింక ఔటూ..
జింతాత జిత జిత జింతాతతా..
జింతాత జిత జిత జింతాతతా..

(పంచదార బొమ్మ from మగధీర)
పంచ కట్టీ వచ్చాడమ్మా.. మంచి మనసున్నోడమ్మా
పంచ మంటే ప్రాణాల్నైనా పంచి పెట్టేస్తాడమ్మా...
పిలిస్తే పలికే వాడూ జనంకై బతికే వాడూ వీడేనోయమ్మా..
వీడు గెలిచాడంటే మనకే మేలమ్మా..
మరి గెలిపించాల్సిన బాథ్యత మనదమ్మా..
వీడు గెలిచాడంటే మనకే మేలమ్మా..
మరి గెలిపించాల్సిన బాథ్యత మనదమ్మా..

(రమణమ్మా from బంపర్ ఆఫర్)
వెయ్యవే రవణమ్మా.. ఓటెయ్యవే రవణమ్మా..
ఇనుకోవే జానకమ్మా.. ఈడు మన ఓడే తులసమ్మా..
మంచి పన్లు చేస్తాడీడు.. మంచి పన్లు చేస్తాడీడు..
మంచి పన్లు చేస్తాడీడు.. మంచోడూ వీడే నరసమ్మా..
ఆలోచించుకో సూరమ్మా..
నువ్వెయ్యవే రవణమ్మా.. ఓటెయ్యవే రవణమ్మా..

(నువ్వెక్కడుంటే.. from గోపీ గోపిక గోదావరి)
ఈడొక్కడుంటే చాలండీ మనకీ.. ఊరే కళ కళ..
పక్కోడు గానీ నెగ్గాడు అంటే జనమే విల విల..
స్కాములే చెయ్యడు వీడూ.. రాములోరి లాంటివాడు..
ఆకలే తెలిసినవాడూ.. అన్నలా ఆదరిస్తాడు..
కోతి గుర్తు కే మీ ఓటు వేసెయ్యండీ...
అంజి గాడినే మీరంతా గెలిపించండీ...
ఈడొక్కడుంటే చాలండీ మనకీ.. ఊరే కళ కళ..
పక్కోడు గానీ నెగ్గాడు అంటే జనమే విల విల..

No comments: