14 July 2010

హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య

పల్లవి

హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య ||2||
భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య ||2||
పెంచింది నన్ను మీ అభిమానము
మీ తోడై ఉంటాను కలకాలము
సరదాగా సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో ||హే సయ్యారే||

చరణం 1

అన్నా తమ్ముళ్ళు ఈ అనుబంధమూ
ఇలలో అందరికీ అది ఆదర్శము
లోకం నా లోకం ఇక మీరేనురా
ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా
వేళ్ళు ఒక్కటైతే అది ఉక్కు పిడికిలిరా
అందరొకటైతే కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే ||హే సయ్యారే||

చరణం 2

మీరే నా కళ్ళు ఏ నాటికీ మీరే తమ్ముళ్ళు ఏజన్మకీ
ఎపుడూ తీరని మీ ఋణమన్నదీ
దైవం తెచ్చాడు ఈ వరమన్నదీ
అన్న కన్నుల్లో వెలిగేటి దివ్వెలివీ
అన్న గుండెల్లో పూచేటి పువ్వులివీ
నామాటే వేధంగా నడిచేటి తమ్ముళ్ళంటే మీరే ||హే సయ్యారే||

No comments: