16 July 2010

బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా

బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా
శ్వాశించలేను నిను చూడకుండా
జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు
ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడ
గోరంత విరహాలు కొండంత మురిపాలు
జల్లంత జలసాలు జరిపించు ఘనుడ
నీ అడుగు జాడ అది నాకు మెడ
బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా

ఈ మహారాజు చిరునవ్వునే నా మణిహార మనుకొందున
ఈ వనరాణి కొనచూపునే నా ధన దాన్యమనుకొందున
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం వొడిలో గుడిలో వల్లించనా
నువ్వై నావే గాయత్రి మంత్రం పగలు రేయి జపియించనా
నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు
నీవెంటే నామనుగడ నీగుండె నా తలగడ

బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా

నీ మీసాల గిలిగింతకే ఆ మోసాలు మొదలాయేనా
నీ మునివేళ్ళ తగిలింతకే ఆ మునిమాపు కదలాయేనా
నీకే నీకే సోగాసాభిషేకం నిముషం నిముషం చేయించనా
నీతో తనువు మనసు మమేకం మనదోలోకం అనిపించనా
సంసార కావ్యాలు సంస్కార కార్యాలు
కలగలుపు గుణవంతుడ కలియుగపు భగవంతుడా

బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips