14 July 2010

మేఘమాల మెరిసిందటే వాన చినుకు కురిసిందటే

పల్లవి

మేఘమాల మెరిసిందటే వాన చినుకు కురిసిందటే
నేలకు ఆనందం ఆ నింగికి ఆనందం ||2||
తారాలన్ని మురిసే వేళ నీటి పూలై విరిసే వేళ
వెన్నెల ఆనందం ఆ వన్నెలు ఆనందం ||2||
ఆనందం మర్మముమైతే అనురాగం మమ్మరమైతే
స్వర్గానికి నిచ్చెన వేస్తా ఈ జగతికి ప్రాణం పోస్తాం ||మేఘామాల...||

చరణం 1

అచ్చతెలుగు అంటానన్ని అచ్చం నా కోసం
వెండి మబ్బుల బంగారు తొడుగే మా కోసం
నవ్వు పువ్వులే ఈ జన్మంతా రువ్వులు మా కోసం
గుండె లోతుల తేనెల మడుగే మా కోసం
మన్ను మిన్ను వన్నె చిన్నె అన్ని మా కోసం
ఉదయ సంధ్యా సాయం సంధ్యల వెలుగు మా కోసం
అమృతానికి తీపిని అద్దిన సొగసు మా కోసం
స్వర్గ సారను మించగా పుట్టినా భూమి మా కోసం ||మేఘామాల...||

చరణం 2

చందమామకు వంతెన వేసే వెన్నెల మా కోసం
నీలి కన్నుల తెల్లని కలలే మాకోసం
చంద్రవంక వాగు వంక నిత్యం మా కోసం
కొండకోన చెట్టు చేమ మా కోసం
ఏడు రంగుల ఇంద్రుని ధనస్సు పొంగు మా కోసం
ఈడు రేగిన ఇంతటి మనస్సు పొంగు మా కోసం
అదుర లేనిది ఏది లేదను వయస్సు మా కోసం
ఇన్ని ఇచ్చిన ఆ పై దేవుడు అసలు మా కోసం ||మేఘామాల||

No comments: