14 July 2010

చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను

పల్లవి
చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను
నాలోనే వలపు పొంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను
నిన్ను నే చేరుకున్నాను

చరణం 1

చూపుల శృంగార మొలికించినావు
మాటల మధువెంతో చిలికించినావు
వాడని అందాల వీడని బంధాల తోడుగ నడిచేములే ||చిలిపి||

చరణం 2

నేను నీ దాననే నీవు నావాడవు నను వీడిపోలేవులే
కన్నుల ఉయ్యాలలూగింతు నోయి
చూడని స్వర్గాలు చూపింతు నోయి
తీయిన సరసాల తీరని సరదాల హాయిగా తేలేములే ||ఎన్ని||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips