14 July 2010

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు

పల్లవి

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు (2)
ప్రేమించామంటారు పెద్దగ చెబుతూంటారు
పెళ్ళి మాట ఎత్తగానే చల్లగ దిగజారుతారు
అమ్మబాబో నమ్మరాదు ఈ తగలమారి అమ్మాయిల నమ్మరాదు
డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కున పట్టేస్తారు
లవ్ మారేజీలంటూ లగ్నం పెట్టేస్తారు ||అమ్మబాబో||

చరణం 1

కట్నాలు పెరుగునని కాలేజి కెళ్తారు (2)
హాజరు పట్టి వేసి గైరు హాజరవుతారు
మార్కుల కోసం తండ్రుల తీర్ధయాత్ర తిప్పుతారు
ఇంజనీర్లు డాక్టర్లయి ఇక చూస్కోమంటారు ||అమ్మబాబో||

చరణం 2

వరండాలోన చేరి వాల్చూపులు విసురుతారు (2)
సినిమాలు షికార్లంటూ స్నేహం పెంచేస్తారు
తళుకు బెళుకు కులుకులతో పైట చెంగు రాపులతో
చిటికెలోన అబ్బాయిల చెంగున ముడివేస్తారు ||అమ్మబాబో||

చరణం 3

ఆస్తి వున్న పిల్లయితే అందం జోలికి పోరు
కుంటిదైన కురూపైన పెళ్ళికి యస్సంటారు
పెళ్ళి అయిన మర్నాడే శ్రీవారిని చేతబట్టి
బయటికి అత్తామామల దయచేయండంటారూ ||అమ్మబాబో||

చరణం 4

దిమ్మతిరిగి ఏమిటలా తెల్లమొగం వేస్తావు
వలపు దాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు
మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము

No comments: