14 July 2010

చిటపట చినుకులు పడుతూ ఉంటే

పల్లవి

చిటపట చినుకులు పడుతూ ఉంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి||2||

చరణం 1

ఉరుములు పెళపెళ ఉరుముతూ ఉంటే
మెరుపులు తళతళ మెరుస్తూ ఉంటే
మెరుపు వెలుగులో చెలి కన్నులలో
బిత్తరచూపులు కనబడుతూంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వెచ్చగ ఉంటుందోయి||2||

చరణం 2

కారుమబ్బులూ కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే
కళ్ళకు ఎవరూ కనబడకుంటే కనబడకుంటే
జగతిని ఉన్నది మన మిద్దరమే అనుకుని
హత్తుకుపోతుంటే||2||
||చెప్పలేని||

చరణం 3

చలిచలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే||2||
చెలి గుండియలో రగిలే వగలే||2||
చలి మంటలుగా అనుకుంటే
||చెప్పలేని||చిటపట||

No comments: