14 July 2010

నేడు నా మనసు ఉయ్యాల లూగెనే

నేడు నా మనసు ఉయ్యాల లూగెనే
నాదు మదిలోని కోరికలు రేగెనే ||నేడు||
కొమ్మ మీద చిలకమ్మ
కొసరి కూసే కోకిలమ్మ
బావకు నాకూ పెళ్లోయమ్మా
పాటలు కమ్మంగ పాడాలమ్మ
మిమ్ము నే పిలువ వచ్చానే విందుకు
మీరే నిజమైన చుట్టాలైనందుకు ||నేడు||
మీతో పాటే వనిలో వుంటా
కాయలు పళ్లూ తిని జీవిస్తా
పనిపాటలలో పరుగులు తీస్తా
బావకు నేనే సాయం జేస్తా
అడవికి రాణీరాజులు మేమై
హాయిగ కాలం గడిపేస్తాం ||ఆహా||
యీ అడవి నా రాజు యిల్లులే
మమ్ము బ్రతికించే బంగారు తల్లివే ||నేడు||
బడలికతో బావ యిల్లు చేరితే
ఉడుకు నీళ్లతో వీపు కడుగుతా
బువ్వ పెట్టి కతలెన్నో చెపుతా
ఓ . . . చెలియలారా
పుట్టెడు అలసట తీరిచి వేస్తా ఓ
మాదే జీవితము మాదేను అందము
లేదు సోమరికి యిట్టాటానందము ||నేడు||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips