14 July 2010

ఏకాకిగ విలపించుచుంటినా చీకాకున బడి తల్లీ!

ఏకాకిగ విలపించుచుంటినా చీకాకున బడి తల్లీ! ||ఏ||
కాపురముండవు కష్టాలేవీ కలకాలము ఓ చెల్లీ! ||ఏ||
మిడిసిపడే యీ పెత్తనదారులు మెత్తని కత్తులు తల్లీ!
కలిమి బలంతో పేదల జంపి కులుకుచుందురో చెల్లీ! ||ఏ||
అన్నను మించిన ఆప్తుని యొవడో హత్య చేసె గద తల్లీ!
దేవుని సన్నిధికేగిన తల్లీ తిరిగిరాదు ఓ చెల్లీ! ||ఏ||
విడదీసెడు మీ గువ్వల జంటను వేటకాడు నా తల్లీ!
నిజమేదో తెలియును జగతికి నిలకడ మీదను చెsల్లీ! ||ఏ||

No comments: