14 July 2010

బీదల రోదన వినవా

బీదల రోదన వినవా
నిరు పేదల వేదన కనవా
ఓ కానని దైవమా ||బీదల||
కూటసాక్ష్యములు చెప్పేవాళ్లు
కొంపలు తీసి గడించేవాళ్లు
జారులు చోరులు కూనికోరులు
వీరా వూరికి పాలకులు
ఓ కానని దైవమా ||బీదల||
సొమ్మిస్తేనే రక్షిస్తావా
నమ్మినదీనుల శిక్షిస్తావా
దీనుల కాచే దేవుడందురు
దేనికి నీకీ పేరో చెపుమా
ఓ కానని దైవమా ||బీదల||
కానీ లేదుర ముడుపుగట్టుటకు
కన్నీటను నీ కాళ్లు కడిగెదను
అన్నెము పున్నెము ఎరుగమురా
మమ్మాదరించి కాపాడ రమ్మురా
ఓ కానని దైవమా ||బీదల||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips