09 July 2010

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకం తో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను
తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని (2)


చిలిపిగా నీ చేతులు అణువణువు తడుముతుంటె
మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటె
ఆశల అల్లరి అణిగేనా
పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణా శృతించనా
ఆ వెన్నెల ఈ కన్నుల రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని (2)


తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడు మలుపులు తెలిసెననీ
తెల్లారనికే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు ఈ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని (2)

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips