07 July 2010

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

పల్లవి:
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుందని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవసమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

చరణం 1:
ఈపూట చెలి నా మాట ఇక కరువైపోఎనులే
ఆధారము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాఎనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణమూ నీ చేతిలో ఊన్నదిలే

చరణం 2:
కోకిలమ్మ నువ్వు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలి మేటికెలు విరిచేనే
నీ చేతి చలి గాలులకు తేరా చాపి నిలిచేనే
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే

No comments: