14 July 2010

కృష్ణహరే శ్రీకృష్ణహరే

కృష్ణహరే శ్రీకృష్ణహరే
గిరిధారి హరే మురవైరి హరే
చీకటిలో తారాడే జీవుల
చేరదీయు తండ్రీ !
ఆదరించు తండ్రీ !
అశాంతిలో కుమిలేదీనుల
ఆర్చితీర్చు తండ్రీ!
ఆదరించు తండ్రీ! . . . కృష్ణ
పతితులమయ్యా
పాపులమయ్యా
ప్రాపుజూపయ్యా
నీ పాపలు మేమయ్యా
మానవత్వం సమానత్వం
మాలో నిలుపవయ్యా
ఓ దేవా మంచికి నడుపయ్యా
శోకం చీకటి ఆకలి బాపి
శాంతి చూపవయ్యా ఓ దేవా!
క్రాంతి చంపవయ్యా . . . క్రిష్ణ . .

No comments: