14 July 2010

తెలిసి తెలిసి వలలో పడెనే వయసు

పల్లవి

తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు
తనువున ఎన్నో తపనలు రేగే
తహ తహలోనే తకదిమి సాగే

చరణం 1

పొద్దసలే పోక నిద్దుర పోనీక
ఎవ్వరిదో కేక ఎదోతులదాకా
భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం
రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా
నీగాలి సోకేనా నా ఊపిరాడేనా
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే

చరణం 2

నాకొద్దీ దూరం వెన్నెల జాగారం
బాత్‌రూం సంగీతం లేత ఈడు ఏంకాంతం
కోపమొచ్చే నామీద తాపమాయె నీ మీద
దేహాలు రెండైన ప్రాణాలు నీవేగా
విసిగించు పరువాన విధిలేక పడివున్న

No comments: