15 July 2010

మనసు మనసు కలిసిపోయే

పల్లవి

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ||మనసు||
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మ్రోగే
ఇల్లేస్వర్గమాయే ఎదజల్లే మూగప్రేమల్లోనా
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ||ఏడు||

చరణం 1

కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే
మనుషులు మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే
ఊరువాడ ఉయ్యాలూగే హుషారంతా మందేలే
నింగినేల తాళాలేసే సరాగాలు మాకేలే
అరవై యేళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి ||మనసు||
నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పుతాను నీ భాషలో
నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం నువులేని లోకం నాకు నరకం

చరణం 2

అరగని అరుగులు అలికిన వేళ అతిధుల కాహ్వానం
తొలకరి వయసులు పలికిన వేళ తరగని అభిమానం
ఈడుజోడు ఆడే పాడే పదాలన్ని మావేలే
ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే
వీర రాఘవయ్య నీపేరే నిలుపుకుంటామయ్య
ఇల్లు ఇల్లు ఏకమైన పండగేరానీ ||మనసు||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips