14 July 2010

ఏయ్‌ పిల్ల ఏం చేద్దాం చెప్పు

పల్లవి

ఏయ్‌ పిల్ల ఏం చేద్దాం చెప్పు
ఏదో చేసెయ్‌ అది మాత్రం తప్పు
ఏయ్‌ పిల్లా ఏంటమ్మా తప్పు
ఏయ్‌ అబ్బాయ్‌ అడగద్దు ఆ అప్పు
ఏఏ కన్నేసా కోనేట్లో ఆడేసా అందాలలో చాలీసా
కోయ్‌ కోయ్‌ అబ్బాయి లేలేత సొరకాయి
బోర్లిస్తా బొప్పాస్కాయి

చరణం 1

ఆ తేనెలలో ప్రేమలీల ఎన్నడో
ఓ ఫ్యామలీగా రాసలీల ఎప్పుడో
నే పక్కకొస్తే నీకు ఎంత తిక్కరో
నే ముద్దు కోరి సోకితే నీ చక్కిరో
అందాలు మాట్లాడు అమ్మాయి ఒళ్ళంతా
అల్లుకుంటే హాయి కంటే తీపి తుళ్ళింతా
ఆరాలు తీసేటి అబ్బాయి కళ్ళంతా
బేరానికొస్తాయి అమ్మయి కళ్ళంతా ||ఏయ్‌||

చరణం 2

నే చాకులాంటి సోకులున్న పిల్లని
నా సోకు కిందపైట చాటు ఉండని
ఏ దక్కకున్న తీరదే ఈ దప్పిక
నువ్వు ఒప్పుకుంటే తప్పులేదే గోపిక
రేపొచ్చి కనిపించు రెండో కృష్ణయ్యా
ఈలకైనా తీలకైనా వేళ ఉందయ్యా
కోనేటి కెరటాల కోలాటాలమ్మా
నాటికోక కట్టుకోక బెట్టు ఏలమ్మా
ఏయ్‌ పిల్లా ఏం చేద్దాం చెప్పు
ఏయ్‌ చెప్పు కాఫీ ఓకప్పు
ఏయ్ ‌ఒళ్ళు ఎట్టుందో చెప్పు
ఎట్టా ఉన్నా ఉడకదులే నీపప్పు ||ఏఏ . . . సొమ్మా||

No comments: