12 July 2010

నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా

నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా వేణువై రమ్మనే రాగమా
రెప్పల్లో పూల తోట రేపన్నది చూడకుండ వేకువై ఆపితే న్యాయమా
ఇకనైనా మరపు రావెలా మాయమైన క్షణమా
నీడై నా వెంట రాకిలా మాయదారి నిజమా

ముందేం చూడక పదమందే నిలవకా మనసేమి అలోచించక
గమనించే లోగా గమ్యం దాటాకా వెనుతిరిగే వీలే లేదుగా
ఏ గుండెల్లో వాలాలన్న చిరునామా లేక
ఏ శూన్యంలో విహరిస్తుందో నువు పంపిన లేఖ
ఎవ్వరు చెబుతారే ఆరాటమా
నిద్దర్లో నీ వెంట నడిపావే రేయంతా వేణువై రమ్మనే రాగమా
రెప్పల్లో పూల తోట రేపన్నది చూడకుండ వేకువై ఆపితే న్యాయమా

తానే నేరుగా సావాసం కోరగా దరిచేరిందే అభిసారిక
చెయ్యందుకోగా సందేహించాక తెరమరుగైపోదా తారక
ఏం పొందాలనుకుందో హృదయం గుర్తించే ముందే
వెతికె వరమై ఎదురై వచ్చి విడిపోయిందంటే
నేరం నాదేనా అదృష్టమా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips