02 July 2010

ఓ మారియా.... ఓ మారియా....

||పల్లవి||
ఓ మారియా.... ఓ మారియా.... ఓ మారియా.... ఓ మారియా
రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మారియా
ప్రతీరోజు విలువైంది కాదా....
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా....
చేద్దామంటె చూద్దామంటె కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటె కలతే తీరదు ||ఓ మారియా||

||చరణం 1||
సిరిమువ్వ రేపంటు వెనుదీస్తుందా... ఘల్ ఘల్ ఘల్ మోగించగా
సిరిమల్లె మాపంటు ముసుగేస్తుందా..... ఘుం ఘుం ఘుం పంచివ్వగా
ప్రతి దినం ప్రభాతమై వరాలు తెచ్చే సూర్యుడు
ప్రకాశమే తగ్గించునా నా వల్లకాదంటూ.....
ప్రతిక్షణం హుషారుగా శ్రమించి సాగే వాగులు
ప్రయాణమే ఆపేయునా మాకింక శెలవంటూ.....
హె... ఉల్లాసంగ ఉత్సాహంగ బ్రతుకే సాగనీ
అంతేలేని సంతోషాలు వొళ్ళో వాలని ||ఓ మారియా||

||చరణం 2||
చిరుగాలి చిత్రంగా రానంటుందా..... ఝుం ఝుం ఝుం పయనించగా
కొమ్మల్లో కోయిల్ల కాదంటుందా..... కూ కూ కూ వినిపించగా
అనుక్షణం దినం దినం అలాగె సహనం చూపుతూ
విరామమే లేకుండగా ఈ భూమి తిరుగునుగా.....
ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గువ్వలు
ప్రతిక్షణం అదే పని ఆరాటపడిపోవా...
హె... మనసే ఉంటె మార్గం తానె ఎదురొస్తుందిలే....
సత్తా ఉంటె స్వర్గం కూడ దిగివస్తుందిలే ||ఓ మారియా||

No comments: