14 July 2010

పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా

పల్లవి

పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా ||2||
పాడవేల రాధికా. . .

చరణం 1

ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో జీవితమే పులకించగా ||2||
నీ వీణను సవరించి ||పాడవేల రాధికా||

చరణం 2

గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి ||2||
ఏ మూలనో పొంచి పొంచి ||2||
వినుచున్నాడని ఎంచి ||పాడవేల రాధికా||

చరణం 3

వేణుగానలోలుడు నీ వీణా మృదు రవము విని ||2||
ప్రియమారగ నినుచేరగ దయచేసెడి శుభవేళ ||పాడవేల రాధికా||

No comments: