14 July 2010

ఓహొ ఓహొ నిన్నే కోరెగా

పల్లవి

ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అని కోయిలా ||2||
వసంతవేళలా పసందు మీరగా
అపూర్వగానమే ఆలపించే తీయగా ||ఓహొ . . .||

చరణం 1

అదా కోరికా వయ్యారి కోయిలా
జగాలే నీ చూపులో జలదిరించెలే ||2||
వరాల నవ్వులే గులాబి పువ్వులై
వలపు తేనె నాలోన చిలకరించెనే ||ఓహొ||

చరణం 2

ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో తేలిపో హాయి హాయిగా ||2||
ఉయ్యాలలూగే నామది చిటారుకొమ్మలా
నివాళి అందుకో ఈవేళ పండుగా
సదా సుధా తరంగాల తేలిపోదమా
ఓహొ ఓహొ నిన్నే కోరితి
కుహుకుహు అనీ పాడితి ఆ హా హా . . .

No comments: