14 July 2010

చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే

పల్లవి

చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే . . .
టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే . . .

చరణం 1

అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు ||2||
పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా ||2||
పెళ్ళామంటే బెల్లము తల్లిదండ్రి అల్లము ||చక్కని . . .||

చరణం 2

ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే ||2||
పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా ||2||
పెద్దల గొడవ ఎందుకే ఇద్దరమొకటై ఉందామే ||చక్కని . . .||

చరణం 3

మీ నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము ||2||
అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు ||2||
సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా ||2||
చేయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము ||2|| ||టక్కరి . . .|| ||చక్కని . . . ||

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips