14 July 2010

ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు

పల్లవి

ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి ||ఈ ముసి . . .||

చరణం 1

పొదరింటన ఒంటరి పావురము
తన జంటను కలియగ వేచినది
మనసే తెలిసి తన ప్రేయసికై
మగ పావురమే దరిచేరింది ||ఈ ముసి . . . ||

చరణం 2

నీ కురులను రేపిన చిరుగాలి
నామదిలో కోరిక రేపినది
వలపే తెలిపే కనుసైగలతో
నీ ఊసులు బాసలు చేసాయి ||ఈ ముసి . . .||

చరణం 3

నదిలో మెరిసే కదిలే కాంతి ||2||
నా మోమున తళ తళ లాడింది
నీ చక్కని చెక్కిలి అద్దాన
నా రూపము నేనే చూశాలే ||ఈ ముసి. . .||

No comments: