02 July 2010

చిలకమ్మ ముక్కుకీ దొండ పండుకీ ఏనాడొ రాసి పెట్టుంది.........

||పల్లవి||
చిలకమ్మ ముక్కుకీ దొండ పండుకీ ఏనాడొ రాసి పెట్టుంది.........
కాకమ్మ మూతికీ కాకరకాయకీ ఆనాడే రాసి పెట్టుంది...........
ఆశే ఉంటే అంతో ఇంతో అందేనండి...... మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండి.... మన పర బ్రహ్మం మళ్ళి అంటూ ఉన్నాడండి
యె ఒ ఒ యె ఒ యె ఒ .......ఉందొయ్ రాసి
యె ఒ ఒ యె ఒ యె ఒ .......లేదొయ్ రాజి ||చిలకమ్మ||

||చరణం 1||
సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిళ్ళే కూలినా బంధువులె పొయినా అయ్యె పెళ్ళాగునా రాసుంటే
చల్లే అక్షింతలు నిప్పులే అయినా పెళ్ళాగదు రాసే ఉంటె
హొయ్...మెళ్ళొ పూమాలలు పాములే అయినా పెళ్ళాగదు రాసే ఉంటె
యె ఒ ఒ యె ఒ యె ఒ .......ఉందొయ్ రాసి
యె ఒ ఒ యె ఒ యె ఒ .......ఒద్దొయ్ పేచి

||చరణం 2||
తిక్కన్నే వచ్చినా యెఱ్ఱన్నే వచ్చినా జరిగే కధ మారునా రాసుంటె
గురుడే బొధించినా వరుడే పాటించినా జరిగే కధ మారునా రాసుంటె
సింహం ఓ పక్క నక్క ఓ పక్క కధ మారదు రాసే ఉంటే
పెళ్ళం ఓ పక్క బళ్ళెమొపక్క కధ మారదు రాసే ఉంటే
యె ఒ ఒ యె ఒ యె ఒ .......ఉందొయ్ రాసి
యె ఒ ఒ యె ఒ యె ఒ .......బ్రతుకే చీచి

No comments: