02 July 2010

ప్రేమించుకున్నవాళ్ళు ఊహల్లో తేలుకుంటు ఊటీకి చేరవచ్హులే.......

||పల్లవి||
ప్రేమించుకున్నవాళ్ళు ఊహల్లో తేలుకుంటు ఊటీకి చేరవచ్హులే.......
ప్రేమల్లొపడ్డవాళ్ళు ఖర్చేమిపెట్టకుండ కాశ్మీరు చూడవచ్హులే........
ఇంతలో గెటప్పులెన్నో మార్చవచ్హు........ అంతలో సెటప్పు చేంజి చెయ్యవచ్హు......
ఎందరో ఎక్స్ట్రాలు కూడ వుండవచ్హు........
తెలుగు ఫిల్ము పాట మాదిరి........... ||ప్రేమించు||

||చరణం 1||
పాట పాడుకుంటు వెళ్తె వెనకనుంచి వస్తాయి బెలూన్లు........
డాన్సు చేసుకుంటు వెళ్తె మీదనుంచి పడతాయి పూలు, పళ్ళు........పూలు, పళ్ళు........
అడవిలోన బోరు కొట్టి అవుడ్డోరు కొస్తాయి నెమళ్ళు..........
ఆకశాన్ని వదిలిపెట్టి లొకేషన్ కి వస్తాయి మబ్బులు, నీళ్ళు...........మబ్బులు, నీళ్ళు...........
పావురాలు, చిలుకలు, పలు రకాల పక్షులూ...........
లాంతర్లు, గొడుగులు, కొత్త స్టీలు బిందెలూ.......
అడగకుండ వస్తాయి, ఆశీస్సులు ఇస్తాయీ................. ||ప్రేమించు||

||చరణం 2||
ప్రేమ యుగళ గీతానికి సంగీతాన్నిస్తాడు నారదుడు.........
పెదవి మనము కదుపుతుంటె వెనకనుంచి పాడతాడు గాన గంధర్వుడు......గాన గంధర్వుడు......
చిలిపి వలపు సినిమాకి స్క్రిప్ట్ తాను రాస్తాడు మన్మధుడు...........
సిగ్గుపడుతు నిలుచుంటే స్టెప్పులెన్నో నేర్పుతారు మేనకా రంభలూ.....మేనకా రంభలూ.....
ప్రేమ అనే చిత్రానికి ఎవరయ్యా దర్శకుడు.........
క్రేను మీద కూర్చున్న ఆ బ్రహ్మ దేవుడు.........
చివరి రీలు లోన కథను సుఖాంతమే చేస్తారూ......... ||ప్రేమించు||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips