12 July 2010

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా
ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా

నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే
ఓ… నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోందే
పరిసరి పసనిస నినిపమరిస రిపమప
మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే
ఓ…. యదను తాకగనే ఏదో హాయి రగిలేనే
చాటుమాటు గా నిన్నే నే చూస్తున్నానే
గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే
ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే
సంపంగి రెమ్మా.. పూబంతి వమ్మా……
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా

రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే
ఓ… కలలో నిన్నే చూసి మురిసిపోతానే
ఆ ఆ ఆ ఆ ఉదయమే ఐనా మేల్కొన మనసు పడనీదే
ఓ… కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని
ఏకాంతానా నీ ఊహలో జీవిస్తానే
ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే
నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా

No comments: