12 July 2010

I am in love I am in love

I am in love I am in love I am in love with you
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే
I am in love I am in love I am in love with you
కనులలో దాచిన కావ్యమే నువ్వు

కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా
వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి
నే నీటి చుక్కై పోవాలి
నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి
నిను చేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై
నిను నేను చేరుకుంటే హాయి
నిను నేను చేరుకుంటే హాయి

నీవు ఎదురుగ నిలచి ఉండగ
మాట దాటదు పెదవిని
నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు శోకెను మనసుని
నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి
నే నీలో నిండిపోవాలి
నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో
నిలువెల్ల నేనే తడవాలి
నాలోని ప్రేమ ఏనాటికైన నీకే అంకితమవ్వని
నీకే అంకితమవ్వని
I am in love I am in love I am in love with you
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips