06 July 2010

రావయ్య ముద్దుల మామ

రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ జంట జాగారం చేయాలమ్మ
మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకొని వెల్లువలొ ఝల్లుమనే కధేవిందామా

మనసైన మాపటి లగ్గంలోన మన పెళ్ళి జరిగేను
అక్షింత లెయ్యగ వలపులు రేపు లక్షింతలయ్యేను
నిరీక్షనే ఫలియించి వివాహమె కాగ
ప్రతీ క్షణం మనకింక విలాసమై పోగ
కలలె నిజమై సల్లాపమే సన్నాయి గా మ్రోగె

విరజాజి వేళకు విందులు చేసి విరిసింది నా ఈడు
మరుమల్లి పూజకు తొందర చేసి మరిగింది నీ తోడు
సుతారమై నామేను సితారలా మ్రోగే
ఉల్లాసమే నాలొన ఉయ్యాలలే ఊగే
వడి లొ ఒదిగి వయ్యారమే సయ్యాటలే కోరే

No comments: