15 July 2010

పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద

పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే
ఇక్కడనే వుంటే ఉన్నా లేనట్టే
now or never! now or never! Now or Never!
||పద పద||
.
||చ||
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేదీ చోటు ||2||
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
ఎదటలేని మరునాటిని నేడే కలలపంట చూస్తూ
||పద పద||
.
||చ||
నీతో నువు కలహిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు ||2||
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీకధ కక్కడ శ్రీకారం చుట్టు
||పద పద||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips