15 July 2010

కులాసాల సరసాల కురిపింతురా

పల్లవి:

కులాసాల సరసాల కురిపింతురా
ఖుషీగా విలాసాల మురిపింతురా
హమేషా తమాషాల అలరింతురా ఆ ఆ ఆ
అందచందాలుగని అందచందాలుగని
ఆదరించు నారాజా అందాల ఆనందం అందుకో నారాజా
అందాల ఆనందం అందుకో నారాజా
అందచందాలుగని ఆదరించు నారాజా

చరణం1:

రంగారు సింగారముల రాసలీల
పొంగారు సంగీతముల రాగమాల
చెంగు చెంగని ఆడు నాట్యాల బాల ఆ ఆ ఆ
అందచందాలుగని అందచందాలుగని
ఆదరించు నారాజా అందాల ఆనందం అందుకో నారాజా
అందచందాలుగని ఆదరించు నారాజా

చరణం2:

రంగరంగేళిగా లాలింపరా
కొంగుబంగారుగా కులికింపరా
జగన్మొహనా నా మొరాలింపరా ఆ ఆ
అందచందాలుగని అందచందాలుగని
ఆదరించు నారాజా అందాల ఆనందం అందుకో నారాజా
అందచందాలుగని ఆదరించు నారాజా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips